తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా మంత్రులు మరియు కలెక్టర్లకు కీలక ఆదేశాలను జరీ చేశారని తెలుస్తోంది. గత వారంలో కొత్తగా నిర్మించిన సచివాలయంలో జరిగిన కాబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలపై సీరియస్ గా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, పోదు పట్టాల పంపిణీ, ఇళ్ల స్థలాల పంపిణీ, హరితహారం పై ఎప్పటికప్పుడు మీటింగ్ లు నిర్వహించాలని సంబంధిత మంత్రులు మరియు కలెక్టర్ లను ఆదేశించారు. మనము అధికారంలోకి వచ్చిన ఈ కాలంలో ప్రజలకు చేసిన అభివృద్ధిని అందరికీ తెలపాలని గట్టిగా చెప్పారు. మొదటి నుండి కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని మంత్రులకు వివరించి ఇదే విధంగా ప్రజలకు చెప్పాలని సెలవిచ్చారు.
కాగా వివిధ శాఖలలో అద్భుతమైన పనితీరును కనబరిచిన మంత్రులను అభినందించాడు. దశాబ్ది ఉత్సవాలను ఒక పండుగలుగా చేయాలని ఆయా శాఖల వారిని ఆదేశించాడు.