తెలంగాణాలో కేవలం మరో వారం రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఎన్నికలలో BRS, కాంగ్రెస్ మరియు బీజేపీ ల మధ్యన పోరు ఉండనుంది. ఈ సమయంలో అన్ని పార్టీలు కూడా ప్రచారంలో చాలా హుషారుగా జోరును పెంచాయి. ఎలాగైనా ఎన్నికల్లో నెగ్గాలన్న ఆశతో ప్రధాన పార్టీలు అన్నీ కూడా ఓటును కొనుగోలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తారు. అయితే తెలంగాణ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవ్వరైనా ఓటు వేయడానికి డబ్బులు తీసుకున్న లేదా ఇచ్చినా నేరమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మీరు ఎవరికీ అయితే ఓటు వేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారో వారికి మాత్రమే ఓటు వేయాలంటూ పోలీసులు చెప్పారు. మీరు వేసే ఈ ఓటు మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అంటూ చెప్పారు.
మరి ఈ ఎన్నికల్లో ఎంతమంది అమౌంట్ తీసుకుకోండా ఓటు వేస్తారన్నది వారి వారి మనసుకే తెలియాలి. ఇక నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.