తెలంగాణా రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితుల పై హైకోర్టు సుదీర్ఘ విచారణ చేసింది. ఈ సంధర్భంగా హైకోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారుల తీరు పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాక ప్రభుత్వానికి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తెలంగాణ రాష్ట్రంలో రెండవ స్టేజ్ కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందన్న హైకోర్టు, WHO నిబంధనల ప్రకారం వెయ్యి మందికి 3 బెడ్లు ఉండాలి కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదని పేర్కొంది.
కరోనా టెస్టుల పై ఇక నుండి తప్పుడు రిపోర్ట్ ఇవ్వకుండా చూడాలని కోర్టు ఆదేశించింది. అంతే కాదు ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ వద్ద డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని హైకోర్టు పేర్కొంది. రాష్ట్రంలో మొబైల్ టెస్ట్ వెకిల్స్ పెంచాలని హైకోర్టు పేర్కొంది. రాష్ట్రంలో అంబులెన్స్ లు 350 ఉన్నాయని, గతంలో 169 అంబులెన్స్ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని కానీ 30 మాత్రమే కొనుగోలు చేశారని కోర్టు పేర్కొంది. ఇతర రాష్ట్రాలలో కేసులు, మరణాలు, టెస్టులు ఏవిధంగా ఉన్నాయి మన రాష్ట్రం లో ఈవిధంగా ఉన్నాయి అనే అంశాలపై గ్రాఫ్ ను తయారు చేయాలని హైకోర్టు పేర్కొంది.