రసవత్తరంగా మారిన బిహార్ రాజకీయం…!

-

ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ బిహార్ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల రణరంగానికి పార్టీలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ.. మరోసారి రాష్ట్ర పాలనా పగ్గాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అటు ఆర్జేడీ సుప్రీం తేజస్వీయాదవ్ ఆధ్వర్యంలోని విపక్ష కూటమి ఈసారి అధికారం దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది.

రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశ అక్టోబరు 28న, రెండోదశ నవంబరు 3న, ఇక చివరిదైన మూడోదశ నవంబరు 7న ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ కోవిడ్ నిబంధనలను సడలించింది. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించుకోవచ్చని ప్రకటించింది. దీంతో రేసు గుర్రాలను రంగంలోకి దింపుతున్నాయి.

బీహార్ సురక్షితంగా ఉండాలంటే అధికారం నితీష్ కుమార్ చేతిలో ఉండాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో ఎన్సీపీ కూడా బరిలోకి దిగుతోంది. ఎన్నికల ప్రచారం కోసం 40 మందితో కూడిన ముఖ్య ప్రచారకర్తల జాబితానూ ఇప్పటికే రూపొందించింది. బిహార్ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవారే ఎన్సీపీ ప్రచారంలో కీలకంగా ఉండనున్నారు. మరోవైపు బిహార్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెడుతున్న శివసేన.. 20 మందితో స్టార్ క్యాంపెయినర్ లిస్టు రూపొందించింది.

Read more RELATED
Recommended to you

Latest news