గత నెల 28న ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఈ ఏడాది సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ గతంలోనే ప్రకటించారు. ఈ ఏడాది మొత్తం మొత్తం 9 లక్షల 7 వేల 393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో మొత్తం 4,64,892 విద్యార్థులకు గాను 2,94,378 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 63.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అమ్మాయిలు 72.3 శాతం కాగా, అబ్బాయిలు 54.24 శాతం మంది పాస్ అయ్యారు.
ఇక సెకండియర్‌లో 67.96 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు. ఈ సారి కూడా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే హవా సాగించారు. ఫస్టియర్‌లో 63.32 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే ఇంటర్ రీ వాల్యూయేషన్‌ను గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే రీ వాల్యుయేషన్ కొరకు 18 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పాస్ కాని విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.