Telangana : రాష్ట్ర బడ్జెట్‌లోఆర్టీసీకి రూ.1,500 కోట్లు

-

మరో రెండ్రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పంపింది. అదేంటంటే.. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1,500 కోట్ల నిధులు కేటాయించాలని టీఎస్ఆర్టీసీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇందులో రూ.850 కోట్లు విద్యార్థుల బస్‌పాస్‌లకు రావాల్సిన రీయింబర్స్‌మెంట్‌తో పాటు బ్యాంకు రుణ వాయిదాలు ఉన్నాయి. మరో రూ.650 కోట్ల మొత్తాన్ని బస్సుల కొనుగోలు సహా ఇతరత్రా పెట్టుబడి అవసరాలకు సంబంధించిన ప్రతిపాదనలున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 2.95 లక్షలకు పైగా విద్యార్థి బస్‌పాస్‌లు ఉన్నాయి. రాయితీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి తిరిగి ఇస్తున్నా బాగా ఆలస్యమవుతోంది. పైగా పాస్‌ల రీయింబర్స్‌మెంట్‌ మొత్తానికి, ప్రభుత్వం ఇచ్చే మొత్తానికి అంతరం ఉంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 844 గ్రామాలకు సర్వీసుల్లేవు.

ఈ నేపథ్యంలో డొక్కు బస్సుల స్థానంలో కొత్తవి, ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లు బస్సుల సంఖ్యను పెంచుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలో బడ్జెట్‌లో రాష్ట్రప్రభుత్వం ఆర్టీసీకి కేటాయించే నిధులు కీలకం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news