టీఎస్ఆర్‌టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ.. శ్రీశైలం వెళ్లి వచ్చేయచ్చు..!

-

శ్రీశైలం వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీరు ఈ ప్యాకేజీ గురించి చూడాలి. శ్రీశైలం వెళ్లాలని అనుకునే భక్తులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ పలు ప్యాకేజీలని ఇప్పటికే తీసుకు వచ్చింది. అయితే శ్రీశైలం వెళ్లే వారి కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ప్రతీ శనివారం ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి ద‌ర్శ‌నంతో పాటు పాతాళ‌గంగా, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం ఇవన్నీ కూడా చూసి రావచ్చు.

టీఎస్ఆర్‌టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో మీరు దీన్ని బుక్ చేయొచ్చు. శనివారం ఉదయం హైదరాబాద్‌‌లోని జేబీఎస్‌‌లో పర్యాటకులు బస్సు ఎక్కాల్సి వుంది. ఉదయం 7 గంటలకు సూపర్‌ లగ్జరీ బస్సు జేబీఎస్ నుండి స్టార్ట్ కావలి. 8 గంటలకు ఎంజీబీఎస్‌‌లో పర్యాటకులు బస్సు ఎక్కొచ్చు. అక్కడ నుండి శ్రీశైలం స్టార్ట్ కావాల్సి వుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలం రీచ్ అవుతారు. పాతాళగంగకు వెళ్ళచ్చు. కృష్ణానదిలో బోటింగ్‌ ఎంజాయ్ చేయొచ్చు.

సాయంత్రం 5 గంటలకు మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారి ఆలయాన్ని చూడవచ్చు. రాత్రికి శ్రీశైలంలోనే ఉండాలి. రెండో రోజు ఉదయం 5 నుంచి 8 గంటల దాకా భక్తులు ఆలయంలో పూజ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్‌ మ్యూజియం సందర్శన ఉంటుంది. అలానే సాక్షి గణపతి ఆలయం కి వెళ్ళచ్చు. పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం కి కూడా వెళ్ళవచ్చు. దారిలోనే మధ్యాహ్న భోజనం ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే.. రూ.2,700 గా వుంది. పూర్తి వివరాలని అధికారిక వెబ్ సైట్ లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news