BANGARRAJU : “బంగార్రాజు” కలెక్షన్ల సునామీ..2 రోజుల్లో రూ.36 కోట్లు వసూలు

-

అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా… బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. పంచ కట్టులో సరసాలు చిలిపి వేషాలకు బాక్సాఫీస్ మోత మోగింది. బంగార్రాజు గా నాగార్జున చేసిన రచ్చకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమానకు సీక్వెల్‌ గా బంగార్రాజు తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయకుడిగా నాగార్జున చేస్తున్నారు.ఈ సినిమా లో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

ఇక నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటి చింది. అయితే ఈ సినిమా జనవరి 14 వ తేదీన విడుదల అయింది. దీంతో సినిమా పై మంచి టాక్ వస్తోంది.దానికి తోడు సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలేవీ కూడా రాకపోవడం కలిసొచ్చింది. ఇంకేముంది సంక్రాంతి సెలబ్రేషన్స్ లో భాగంగా కుటుంబ సమేతంగా బంగార్రాజు సినిమాకి వెళ్తున్నారు. దీంతో బంగార్రాజు సినిమా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. రెండు రోజుల్లో ఏకంగా 36 కోట్లు వసూలు చేసింది బంగార్రాజు సినిమా. అలాగే ప్రస్తుతం ఇంకా విజయవంతంగా సాగుతోంది ఈ సినిమా. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ జనాలు ఎగబడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news