ఈ నెల 26న లోక్ సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానం దుమారం రేపింది. ఏపీ రాజధానిగా విశాఖను ఎంపిక చేసినట్టు కేంద్రం సమాధానం ఉంది. దానిపై విమర్శలు రావడంతో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధాని విశాఖ అని చెప్పడం తమ ఉద్దేశ్యం కాదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఏపీలో విశాఖ కేవలం ఒక నగరం మాత్రమేనని కేంద్రం వివరించింది. పెట్రోలియం ట్యాక్స్ కు సంబంధించి మాత్రమే తాము విశాఖ ఉదహరించామని స్పష్టం చేసింది.
లిఖిత పూర్వక సమాధానంలో టేబుల్ కు సంబంధిచిన హెడ్డింగ్ జరిగిన పొరపాటు వల్లే ఇలా జరిగిందని స్పష్టం చేసింది. హెడ్డింగ్ లో రాజధాని తో పాటుగా సమాచారం సేకరించిన నగరం పేరును కూడా చేరుస్తామని తెలిపింది. దానికి సంబంధించి లోక్ సభ సచివాలయానికి సమాచారం కూడా ఇచ్చామని తెలిపింది. ఇక కేంద్రం ఇచ్చి క్లారిటీతో విశాఖ రాజధాని వివాదం కాస్త చల్లబడింది.