ఈ ఏడాది చివరి నాటికి గరుడవారధి నిర్మాణం పూర్తి : టీటీడీ

-

తిరుపతిలో శ్రీనివాస సేతు(గరుడ వారధి) నిర్మాణ పనులు ఏడాది ఆఖరి కల్లా పూర్తి చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 2023 కొత్త ఏడాది నాటికి వారధి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని అన్నారు. శ్రీనివాస సేతుతో తిరుపతి స్థానికులకు, భక్తులకు ట్రాఫిక్ సమస్యలు దూరమవుతాయన్నారు.

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా తిరుమలలో ఉన్న అన్ని ఉద్యానవనాలకు కొత్త శోభను తీసుకురానున్నట్లు చెప్పారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 27న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారని చెప్పారు. తిరుమలలో అందుబాటులోకి తీసుకొచ్చిన నూతన పరకామణి భవనాన్ని సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news