ఈరోజు బీజేపీ కోసం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన లాల్ దర్వాజ బహిరంగ సభలో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరం గా మార్చేందుకు మీ అందరితో కలిసి నడిచేందుకే ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు. నిజాం ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్ లో కలపాలని చూస్తే ఇక్కడి ప్రజలు అందుకు వ్యతిరేకంగా పోరాడారని వారికి సర్దార్ పటేల్ మద్దతుగా నిలిచాడని అన్నారు.
ప్రధానమంత్రి పేద రైతులకు ఆరువేల రూపాయలు అకౌంట్లో జమచేస్తుండగా వరద సహాయాన్ని అర్హులకు టీఆర్ఎస్ అకౌంట్ ల ద్వార ఎందుకు ఇవ్వలేదు అని ఆయన్ ప్రశ్నించారు. నిజాం రూపంలో ఒక కుటుంబం హైదరాబాద్ ,తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని మనం దానిని సాకరం కాకుండా చూడాలని ఆయన అన్నారు. హైదరాబాద్ ని భాగ్యనగర్ ఎలా చేస్తారు అని అడుగుతున్నారని యూపీ లో ఫైజాబాద్ ని అయోధ్య గా, అలహాబాద్ ని ప్రయాగ్ రాజ్ గా ఎలా మార్చామో అలాగే ఇక్కడ కూడా బిజెపి అధికారంలోకి రాగానే హైదరాబాద్ భాగ్యనగరంగా పేరు మారుస్తామని అన్నారు.