సామాన్య భక్తులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త

-

రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించబోతోంది టీటీడీ. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భక్తుల సంఖ్య భారీగా ఉంటుందని టిటిడి అంచనా వేస్తోంది. అందుకు తగిన విధంగా ఏర్పాటు చేస్తోంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఎక్కువ మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లితండ్రులకు ప్రత్యేక దర్శనం వంటి ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

ఆర్జిత సేవలుసేవలు, రూ. 300/- దర్శన టికెట్లతో పాటు శ్రీవాణి ట్రస్టు దాతలకు, ఇతర ట్రస్టుల దాతలకు దర్శన టికెట్లు రద్దు అయ్యాయి. బ్రహ్మోత్సవాల సమయంలో స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపి లకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. అలాగే సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.

గదులకు సంబంధించి 50% ఆన్లైన్ లో భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచారు. మిగిలిన గదులను ఆఫ్లైన్లో తిరుమలలోని వివిధ కౌంటర్ల ద్వారా భక్తులకు కేటాయిస్తారు. అక్టోబర్ 1న గరుడసేవ కారణంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రస్టుల దాతలకు, కాటేజీ దాతలకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2వ వరకు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో గదుల కేటాయింపు ఉండదని టీటీడీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news