శ్రీవారి భక్తులకు తీపికబురు… కాలినడక మార్గానికి గ్రీన్ సిగ్నల్

-

తిరుమల శ్రీవారి భక్తులకు మరో శుభ వార్త చెప్పింది టీటీడీ బోర్డు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయం లో .. అలిపిరి కాలినడక మార్గం లో భక్తులను అనుమతించనున్నట్లు టీటీడీ బోర్డు తెలిపింది. మెట్ల గుండా వెళ్లే వారి కోసం నిర్మిస్తున్న నడక దారి పైకప్పు పనులు .. దాదాపు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయానికి భక్తులకు ఆ మార్గంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు .

కాగా అక్టోబర్ 7వ తేది నుంచి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 7వ తేది ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి స్వామి వారి బ్రహ్మోత్సవాలు. ఇక 7వ తేది రాత్రి పెద్దశేష వాహనం.. 8వ తేది ఉదయం చిన్న శేషవాహనం….రాత్రి హంస వాహనం కార్యక్రమాలు జరుగనున్నాయి. 9వ తేది ఉదయం సింహ వాహనం….రాత్రి ముత్యపు పందిరి వాహనం జరుగనుండగా.. 10వ తేది ఉదయం కల్పవృక్ష వాహనం….రాత్రి సర్వభూపాల వాహనం కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇక 15వ తేది ఉదయం చక్రస్నానం….రాత్రి ధ్వజాఅవరోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news