ఆస్థి కోసం తండ్రినే…కుమారుల ఘాతుకం..!

మానవత్వం మంట కలుస్తోంది. బంధాలకు విలువ లేకుండా పోతుంది. కేవలం డబ్బే ప్రాధాన్యంగా అనేక దుశ్చర్యలు జరుగుతున్నాయి. బయటి వ్యక్తులే కాకుండా సొంత కుటుంబ సభ్యులే ఒకరినిఒకరు చంపుకునే పరిస్థితులు దాపురించాయి. ఆస్థి కోసం సొంత సోదరుల మధ్య, తండ్రి కోడుకుల మధ్య, పాలి సభ్యుల మధ్య వివాదాలు చెలరేగి హత్యలకు దారితీస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఆస్థి తగాదాలు ఎక్కువ అవుతున్నాయి. నెల కిందట వరంగల్లో ఇలాంటి ఘటన జరిగింది. తాజాగా ఇలాంటి సంఘటనే సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం బ్రహ్మనపల్లిలో జరిగింది

crime

. ఆస్థి కోసం సొంత కోడుకులే తండ్రిని హత్యచేశారు. ఇద్దరు కొడుకులు చేసిన దాడిలో తండ్రి మరణించాడు. మరో కొడుకును కూడా హత్య చేయడానికి ప్రయత్నించారు. ఘటన అనంతరం నిందితులు నరేష్, క్రిష్ణ పారిపోయారు. ఘటన నుంచి బయటపడిన పెద్ద కోడుకు విఠల్ జోగీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.