వలస కూలీల కోసం టీటీడీ భారీ విరాళం…!

-

కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు పేదలు వలస కూలీలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ప్రతీ రోజు కూలి చేసుకుంటే గాని కడుపు నిండని బతుకులకు కరోనా వైరస్ ఇప్పుడు నరకం చూపిస్తుంది. చిన్న బతుకుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దేశ వ్యాప్తంగా లక్షల మంది వలస కూలీలు పొట్ట చేత పెట్టుకుని సొంత గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. అయితే అధికారులు మాత్రం వారిని వెళ్ళ నివ్వడం లేదు.

వలస కూలీల ద్వారా కరోనా వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేసింది. దీనితో ఇప్పుడు వలస కూలీలను ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉండాలని అంటున్నాయి ప్రభుత్వాలు. అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు వారి విషయంలో చిన్న చూపు చూపిస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీలో ఉన్న వలస కూలీల కోసం, పేదల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకి వచ్చింది.

కరోనా బాధితులను ఆదుకోవడమే కాదు అన్నదానం ట్రస్టు నుంచి జిల్లాకు రూ.కోటి చొప్పున విరాళం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అంటే 13 జిల్లాలకు 13 కోట్లను విడుదల చేసింది. లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన పేదలు, వలస కూలీల ఆకలి తీర్చాలనే నిర్ణయంతోనే దేవస్థానం ఈ నిధులు మంజూరు చేసిందని, ఆకలితో ఉన్న పేదల అన్నదానం కోసం ఈ నిధులు వినియోగించాలని జిల్లా ఉన్నతాధికారులకు బోర్డ్ ఒక ప్రకటన విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news