కడపలో ‘ఫ్యాన్స్’ పోరు..ముంచేస్తారా?

-

కడప అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైఎస్సార్ ఫ్యామిలీ అడ్డా..ఇక్కడ ఆ ఫ్యామిలీ హవా తప్ప..మరొకరి హవా ఉండదు. అందుకే గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. ఇక గత ఎన్నికల్లో జిల్లాలోని 10 సీట్లని వైసీపీ గెలిచేసుకుంది. ఇప్పటికీ వైసీపీ జిల్లాలో చాలా బలంగా ఉంది. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. కానీ కొందరు నేతల మధ్య జరిగే అంతర్గత పోరు..పరోక్షంగా టీడీపీకి ప్లస్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

అసలు ఒక్క సీటు కూడా లేని కడపలో టీడీపీ ఒక్క సీటు గెలుచుకున్నా సరే..అది వైసీపీ ఫెయిల్యూర్ కిందకు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలుచుకుపోతే వైసీపీకి పరువు తక్కువ అని చెప్పొచ్చు. జగన్ సొంత జిల్లాలో కూడా సత్తా చాటలేకపోతే..ఇంకా 175కి 175 సీట్లు టార్గెట్ రీచ్ అవ్వడం అనేది జరిగే పని కాదు. అయితే కడపలో వైసీపీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలు మళ్ళీ ఉన్నాయా? అంటే ప్రస్తుతం కడపలో రాజకీయ పరిస్తితులు చూస్తుంటే..అబ్బే కష్టమే అని చెప్పొచ్చు.

జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది..ఏదో జగన్ బలం వల్ల అది పెద్దగా కనిపించడం లేదు. పైగా వైసీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. దీని వల్ల వైసీపీకి మైనస్ అవుతుంది. అటు టీడీపీ పుంజుకుంటుంది. ఈ పరిస్తితులు వల్ల రైల్వేకోడూరు, రాజంపేట, ప్రొద్దుటూరు, మైదుకూరు లాంటి నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి.

ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి ఉంది. రెండు వర్గాలకు అసలు పడటం లేదు. ఇదే క్రమంలో తాజాగా ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు బావ‌మరిది ప్ర‌ధాన అనుచ‌రుడు సుద‌ర్శ‌న్ రెడ్డిపై అదే వైసీపీకి చెందిన ప్రొద్దుటూరు 19వ వార్డు కౌన్సిల‌ర్ షేక్ మునీర్ టూటౌన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తనని చంపేస్తారని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. 19వ వార్డు కౌన్సిలర్ ఏమో ఎమ్మెల్సీ వర్గంలో ఉన్నారు.

ఇలా రెండు వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది..ఇలాగే పోరు నడిస్తే…వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసీపీకి చాలా ఇబ్బంది.

Read more RELATED
Recommended to you

Latest news