అక్కడ కరోనా పదం వాడటం నిషేధం..!

-

కరోనా పేరు చెబితేనే ప్రపంచంలోని అన్ని దేశాలు వణికిపోతున్నాయి. నివారణకు మందు లేని కరోనాపై పోరాటం కత్తి మీద సాములా మారింది. అయితే ఒక్క దేశంలో మాత్రం ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.. అదే తుర్కెమెనిస్తాన్‌. చైనాలో కరోనా తీవ్రత మొదలు కావడంతోనే.. తుర్కెమెనిస్తాన్‌ పలు జాగ్రత్తలు తీసుకుంది. ఫిబ్రవరి ఆరంభంలోనే తమ దేశ సరిహద్దులు మూసివేసింది. ఆ తర్వాత దేశంలో ఎక్కడా కూడా కరోనా అనే పేరు వినిపించకూడదని ఆదేశాలు జారీచేసింది. ఈ విషయాలను ఒక ఇండిపెండెట్‌ ఎన్‌జీవో వెల్లడించింది.

ప్రజల నోటి నుంచి మాత్రమే కాదు.. సోషల్‌ మీడియాలో కరోనా అనే పదాన్ని వాడకూడదు. ప్రభుత్వం వెలువరించే ప్రకటనల్లో కరోనా అనే పదం కనిపించకూడదని ఆదేశాలు ఉన్నాయి. మీడియా గానీ, అధికారులు గానీ ఆ పదం వాడటానికి వీలు లేదు. ఒకవేళ ఎవరైనా కరోనా అనే పదాన్ని వాడితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు.

ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు నమోదు కాకపోయినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యల విషయంలో తుర్కెమెనిస్తాన్‌ చాలా ముందు ఉంది. ‘ఫాదర్‌ ప్రొటెక్టర్‌’గా పిలవబడే ఆ దేశ అధ్యక్షుడు గుర్బాంగులీ బైర్దేముకామెడోవ్ తమ దేశ పౌరులు కరోనా బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. కాగా, వరల్డ్‌ ప్రెస్‌ ఇండెక్స్‌లో ఈ దేశం చివరి స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news