తాజ్ హోటల్.. ఆ ముష్కరుల దాడికి 12 సంవత్సరాలు..

-

ముంబయి లోని తాజ్ హోటల్ పై ముష్కరుల దాడి జరిగి నేటికి 12సంవత్సరాలు అవుతుంది. పాకిస్తాన్ కి చెందిన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ఇండియాకి వచ్చి ముంబయిలోని తాజ్ హోటల్ పై కాల్పులు జరిపారు. ఆ దాడిలో 166మంది పౌరులు, 18మంది సెక్యూరిటీ గార్డులు చనిపొయారు. చాలా మంది గాయాల పాలయ్యారు.

ఉగ్రదాడిని అడ్డుకునే క్రమంలో ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్, ముంబై పోలీస్ హేమంత్ కర్కరే, అశోక్ కంటే, విజయ్ సలాస్కర్ అమరులయ్యారు. మొత్తం 9మంది ఉగ్రవాదులు చనిపోయారు. అజ్మల్ కసబ్ ఒక్కడే ప్రాణాలతో పోలీసులకు చిక్కాడు. ఈ ఉదంతం జరిగిన నాలుగు సంవత్సరాల తరువాత కసబ్ కి ఉరిశిక్ష అమలు చేసారు.

ముష్కరుల దాడిలో అమరులైన జవాన్లకి ఈ రోజు నివాళులు అర్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news