ట్విట‌ర్ పోల్ : అసంతృప్తికి ఆన్స‌ర్ ఏది?

-

కొత్త క్యాబినెట్ రాక‌తో చాలా వాదన‌లే వినిపిస్తున్నాయి. పాత వారిలో 11 మందిని రిపీట్ చేయ‌డం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో ఎవ్వ‌రికీ అంతుపోల‌డం లేదు. తాము చేసిన త‌ప్పేంటో చెప్పాల‌ని అధిష్టానాన్ని నిల‌దీస్తున్నారు.

 

ముఖ్యంగా హోం శాఖ మంత్రి మేక‌తోటి సుచ‌రిత విష‌య‌మే పెను సంచ‌ల‌నం అవుతోంది. ఆమె ఇప్ప‌టిదాకా మీడియా ముందుకు రాలేదు. త‌న‌ను బుజ్జగించేందుకు వ‌చ్చిన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ (రాజ్య‌స‌భ స‌భ్యులు)కు త‌న వాద‌నేంటో చెప్పి, ఎమ్మెల్యే ప‌ద‌వికి స్పీక‌ర్ ఫార్మెట్ లో రాజీనామా చేస్తున్నానని చెప్పారు.

దీనినే ఆమె బిడ్డ‌లు మీడియా ఎదుట ధ్రువీక‌రించారు కూడా ! ముఖ్యంగా ఆమెనే కాదు ఆమె భ‌ర్త (ఐఆర్ఎస్ అధికారి) ను కూడా అవ‌మానించార‌న్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. దీంతో ఆమె త‌న వాద‌న‌ను మోపిదేవి ఎదుటే కాదు సోష‌ల్ మీడియాలో కూడా బ‌లంగానే వినిపిస్తున్నారు. ప‌దవులు ఉంటేనే మీరు మాట్లాడ‌తారా లేదా ప‌నిచేస్తారా లేదంటే ఓ ఎమ్మెల్యేగా ప్ర‌జ‌ల‌కు మీకు సేవ చేయ‌లేరా? ఇదే కోపం ద‌ళితుల‌కు అన్యాయం జ‌రిగిన‌ప్పుడు ఎందుకు రాలేదు అని నిల‌దీస్తున్నారు ప‌లువురు వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు. మేడ‌మ్ మీరు ప‌రువు పోగొట్టుకోకండి…మీ నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసుకుని జ‌గ‌న‌న్న‌కు క్ష‌మాప‌ణ చెప్పండి అని కూడా స‌ల‌హా ఇస్తున్నారు. ఎవ‌రి వాద‌న ఎలా ఉన్నా కూడా మేక‌తోటి సుచరిత వెన‌క్కు త‌గ్గేలా లేరు.
నిన్న‌టి వేళ ఆమె ఏం రాశారో చూద్దాం..

పదవుల కోసం వేంపర్లాడటం మా ఇంట వంట లేదు…అలా అయితే 2009 లో వైస్ కుటుంబం కోసం అసెంబ్లీ లో తల వంచుకొని నిలబడి, రాజీనామా చేసేవాళ్ళము కాదు….అప్పటి కాంగ్రెస్ ఎన్నో ప్రలోబాలకు గురించేసింది… వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డాము… బెదిరించారు… ఆశ చూపారు…. కానీ మాకు వైస్ కుటుంబం ముఖ్యం….ఈరోజు కూడా అంతే… పదవి ముఖ్యం కాదు… కానీ ప్రతి మనిషి కి ఆత్మభిమానం,, ఓర్పు,సహనం అనేవి ఉంటాయి…అడుగులకు మడుగులు ఒత్తితే అలాగే కొనసాగే వాళ్ళము….కష్టకాలం లో పార్టీ పెట్టేటప్పుడు లేని వారు ఇప్పుడు పార్టీ అధికారాన్ని అనుభవిస్తూ పార్టీ నడిపే స్థాయిలో ఉన్నారు. అలాంటివారి అనాలోచిత నిర్ణయాల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి నష్టం…అని రాశారు ఆమె త‌ర‌ఫున పేజ్ అడ్మిన్.
ఆత్మాభిమానం కోసం బ్రతికే వాళ్ళని అవమానిస్తే ఇలాంటి పరిణామాలే ఉంటాయి అని అధిష్టానం ఇప్పటికైనా తెలుసుకోవాలని మనవి…అని కూడా చెప్పారామె.. ఇదే సంద‌ర్భంలో వైసీపీ అభిమానులు కూడా బాలినేని విష‌య‌మై అంత‌ర్మ‌థనం చెందారు. కొంత క‌లత కూడా చెందారు. అయితే బాలినేని మాత్రం కాస్త దిగివ‌చ్చారు. స‌జ్జ‌ల సంప్ర‌తింపులు, బుజ్జ‌గింపులు ఫ‌లించ‌డంతో ఆయ‌న దిగివ‌చ్చి త‌న విష‌య‌మై క‌ల‌త చెంది ఎవ్వ‌రైనా రాజీనామాచేసినా వాటిని వెన‌క్కు తీసుకుంటున్నార‌ని కూడా చెప్పారు.
మ‌రోవైపు జ‌గ్గ‌య్య‌పేట (ఉమ్మ‌డి కృష్ణా జిల్లా) లో కూడా అసంతృప్తులు త‌గ్గ‌లేదు. అక్క‌డ సామినేని ఉద‌య భాను వ‌ర్గీయులు భ‌గ్గు మంటున్నారు. పిన్నెల్లి రామ‌కృష్ణా రెడ్డి ( ఉమ్మ‌డి గుంటూరు జిల్లా, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం) త‌ర‌ఫున మనుషులు కూడా జ‌గ‌న్ పై కారాలూ మిరియాలూ నూరుతున్నారు. ఇవ‌న్నీ తాత్కాలిక‌మేన‌ని వేదాంత ధోర‌ణిలో చెబుతున్నారు వైసీపీ పెద్ద స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news