చంద్రబాబు ప్రశాంతంగా ఉండనివ్వని రెండు జిల్లాలు…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఇప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. తాము వెనక్కు తగ్గేది లేదని అమరావతి రైతులు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని చేస్తున్న ఉద్యమం ఇప్పుడు విజయవాడ నగరాన్ని కూడా బలంగా తాకింది. శనివారం జరిగిన పరిణామాలు చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కువగా ఈ విషయంలో పోరాటం చేస్తున్నారు.

ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చెయ్యాలని భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబుని ఒక విషయం మాత్రం తీవ్రంగా కలవరపెడుతుంది. అమరావతికి వంద కిలోమీటర్ల దూరం కూడా లేని ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ ఉద్యమంలో ముందుకి రావడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాకు అమరావతి చాలా తక్కువ దూరంలో ఉంది. అయినా సరే వాళ్ళు ముందుకి వచ్చి అమరావతిని రాజధానిగా ఉంచాలని కోరడం లేదు.

ఇక ప్రకాశం జిల్లాలో కూడా పరిస్థితి ఈ విధంగానే ఉంది. అసలు ఈ విషయ౦లో వాళ్ళు ఎందుకు ముందుకి రావడం లేదనే ఆందోళన చంద్రబాబుని వెంటాడుతుంది. అందుకే అమరావతి ఉద్యమాన్ని ఉభయగోదావరి జిల్లాలకు విస్తరించాలి అనే ఆలోచనలో భాగంగా చంద్రబాబు, శనివారం రాజమండ్రి వరకు యాత్ర చేసారు. వాళ్ళు కూడా వస్తే అమరావతి ఉద్యమానికి కలిసి వస్తు౦ది అని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆ రెండు జిల్లాల నేతలతో ఆయన సమావేశం నిర్వహించి ఆందోళనలు చెయ్యాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news