వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీజేపీ, బీఎస్పీ పార్టీలకు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలకు చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆదివారం అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. గోరఖ్‌పూర్ పరిధిలోని చిలుపర్ ఎమ్మెల్యే వినయ్ శంకర్ తివారీ(బీఎస్పీ), సంత్‌కబీర్ పరిధిలోని ఖలీదాబాద్ ఎమ్మెల్యే జై చౌబే సైకిల్ పార్టీ కండువా కప్పుకున్నారు.
2010లో బీఎస్పీ తరఫున శాసనమండలి చైర్మన్‌గా పనిచేసిన గణేష్ శంకర్ పాండే సైత సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ముగ్గురు నాయకులతోపాటు పలు పార్టీలకు చెందిన బ్రాహ్మణ నాయకులు ఎస్పీ కండువా కప్పుకున్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని, నియంత పాలన కొనసాగుతుందని తివారీ ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో భావ ప్రకటన స్వేచ్ఛ లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం కొత్త ట్రెండుకు తెర తీసిందని, గత ప్రభుత్వాలు చేసిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తుందని ఎద్దేవా చేశారు.