కుల్గామ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులపై భారత బలగాలు మరోసారి రెచ్చిపోయాయి. కుల్గామ్‌లో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కుల్గామ్‌లోని హడిగాం ప్రాంతంలో ముగ్గురు టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు, భద్రతా బలగాలు బుధవారం తెల్లవారుజామున గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల జాడ కనిపించడంతో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఉగ్రవాదులు
ఉగ్రవాదులు

అయితే ఈ కాల్పుల సమయంలో ఉగ్రవాదుల తల్లిదండ్రులు వచ్చారు. తమ పిల్లలను పోలీసులకు లొంగిపోమని చెప్పడంతో ఇద్దరు ఉగ్రవాదులు తుపాకులు వదిలేసి సరెండర్ అయ్యారు. దీంతో వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి దగ్గరి నుంచి ఆయుధాలు, బాంబులు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదుల అలజడి ఉందని, అందుకే ఇంకా ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నట్లు భారత బలగాలు వెల్లడించారు.