పంద్రాగస్టు ముందు ఉగ్రకలకలం.. 2వేల తూటాలు లభ్యం

-

స్వాతంత్య్ర దినోత్సవం సమయంలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు చేసిన కుట్రను దిల్లీ పోలీసులు భగ్నం చేశారు. దిల్లీలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రమంగా రవాణా చేస్తోన్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున తూటాలను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు ఆయుధాల స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 2వేల తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది నేరస్థుల ముఠా స్మగ్లింగ్​లో భాగమై ఉంటుందని భావిస్తున్నా.. ఉగ్రవాద కోణాన్ని విస్మరించలేమని చెప్పారు. ఇటీవల దిల్లీలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news