గుంటూరులో బయటపడ్డ రెండేళ్ల కిందటి దారుణం…!

గుంటూరులో రెండేళ్ల కిందట జరిగిన దారుణం ఇప్పుడు బయటపడింది. నజీమా అనే యువతిని నాగూర్‌ అనే యువకుడు హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2018లో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు ఇంట్లో నుంచి వెళ్లిన నజీమా… ఆ తర్వాత అదృశ్యమైంది. ఆమె కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు… కొన్నాళ్లు నజీమా ఆచూకీ కోసం గాలించి ఆ తర్వాత వదిలేశారు.

 

ఇప్పుడు నజీమాకు సంబంధించిన సమాచారాన్ని ఆమె స్నేహితులు తల్లిదండ్రులకు చెప్పడంతో… వాళ్లు ఐజీని కలిశారు. ఐజీ ఆదేశాల మేరకు మళ్లీ దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు… నాగూర్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నజీమాను హత్య చేసినట్లు అతను ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రేమను నిరాకరించినందుకే నాగూర్‌…. నజీమాను హత్య చేసినట్లు చెబుతున్నారు.