ఇద్దరు యంగ్ హీరోల గోల తట్టుకోలేక పోతున్న నిర్మాతలు..!!

-

ఈ లోకంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత వేరే దీనికి లేదు.డబ్బుంటే చాలు అన్ని రకాల పనులు చిటికెలో పూర్తి అవుతాయి. విచిత్రంగా పేద వారిలో కంటే బాగా డబ్బులు ఉన్న వారికే డబ్బు మీద ఎక్కువ ఆశ ఉంటుంది. ఇక సినిమా ప్రపంచంలో డబ్బు అన్నింటినీ డిసైడ్ చేస్తుంది.

ఇక్కడ ప్రధానంగా హీరో ముఖం చూసి, డైరెక్టర్ ముఖం చూసి సినిమా స్టార్ట్ చేస్తారు. వారిని ముందే బుట్టలో వేసుకునేందుకు  అడ్వాన్స్ ఇచ్చి వేరే వైపు వెళ్లకుండా చూసుకుంటారు. ఇక ఇదే సందని వీళ్ల కోరికల చిట్టా బయటకి తీస్తారు. తనతో బాగా క్లోజ్ గా వుండే హీరోయిన్ కావాలని, మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలని, సినిమా రిచ్ గా తీయాలని ఇలా వుంటాయి హీరో గారి కోరికలు. ఇక డైరెక్టర్ మంచి పేరున్న నటీ నటులు కావాలని, సూపర్ లోకేషన్స్ కావాలని గోల పెడతారు.

దీనితో బడ్జెట్ పెరిగే అవకాశం ఉందని ఆ నిర్మాత గోల పెట్టినా వీళ్లు అస్సలు పట్టించుకోరు. ఇప్పుడు ఇద్దరు యంగ్ హీరోల గోల కూడా ఇలాగే ఉంది. రీసెంట్ గా టిపికల్ డైలాగ్ డెలివరీ తో హిట్టు కొట్టిన హీరో హీరోయిన్స్ విషయంలొ నిర్మాత ను తెగ ఇబ్బంది పెడుతున్నాడని అంటున్నారు. ఇప్పటికే ముగ్గురు హీరోయిన్స్ పారిపోయారు మరి. ఇక మరో హీరో సినిమా రిచ్ గా తీయాలని పంతం నెగ్గించుకున్నాడట. తన బడ్జెడ్ కు 4 కొట్లే ఎక్కువ అయితే తాను 5 కోట్లు వరకు పెట్టిస్తున్నడట. తన సినిమా గత కూడా బ్రేక్ ఈవెన్ అందుకోలేక పోయింది. అయినా కూడా తగ్గేది లేదంటున్నాడు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news