క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్​.. 8 పరుగులకే ఆలౌట్​

-

క్రికెట్ హిస్టరీ లో చెత్త రికార్డు నమోదు అయింది. కేవలం 8 పరుగులకే ఓ జట్టు కుప్పకూలింది. ఈ రికార్డు నేపాల్ మహిళా అండర్-19 జట్టు ఖాతాలో నమోదు కావడం విశేషం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరిగిన ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచ కప్ ఆసియా క్వాలిఫైయర్ మ్యాచ్లో నేపాల్ టీం 8 ఓవర్లలో 8 పరుగులకే ఆలౌట్ అయింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నేపాల్ టీం లో ఏ ఒక్కరు క్రీజ్లో నిలదొక్కుకుని లేకపోయారు. పది బంతుల్లో మూడు పరుగులు చేసిన స్నేహ మహారా టాప్ స్కోరర్ గా నిలిచింది. ఆరుగురు బ్యాటరీలు డకౌట్ కావడం గమనార్హం. యూఏఈ రైట్-ఆర్మ్ బౌలర్ మహికా స్పిన్ మాయాజాలానికి నేపాల్ జట్టు కుప్పకూలింది. ఆమె నాలుగు ఓవర్లలోనే కేవలం 2 రన్స్ ఇచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టింది. మరో బౌలర్ హిందూజా నందకుమార్ మూడు వికెట్లు తీసి అనిపించింది. ఆ తర్వాత టార్గెట్ ను యూఏఈ కేవలం ఒక ఓవర్లోనే పూర్తి చేసింది. అంటే మరో 113 బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ ముగిసిన అన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news