వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం భారతీయ సంస్థ తో యూకే ఒప్పందం..!

-

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే పెద్ద ఎత్తున పంపిణీ చేసేందుకు యూకే ప్రభుత్వం ముమ్మర కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు మిలియన్ల కొద్దీ వ్యాక్సిన్ డోసులు అందించేలా ముంబయికి చెందిన అంతర్జాతీయ ఫార్మా సంస్థ ‘వోకార్ట్​’తో ఒప్పందం కుదుర్చుకుంది.వ్యాక్సిన్ ఉత్పత్తిలో కీలకమైన ‘ఫిల్​ అండ్ ఫినిష్​’ ప్రక్రియ నిర్వహించేందుకు సంస్థతో 18 నెలల ఒప్పందాన్ని చేసుకున్నట్లు యూకే వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. ఒప్పందంలో భాగంగా వ్యాక్సిన్​ను వయల్స్​ లోకి నింపి పంపిణీకి సిద్ధం చేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ సప్లై చైన్ ​లో ఈ ఒప్పందం కీలకంగా అభివర్ణించింది యూకే ప్రభుత్వం.

vaccine
vaccine

ఒప్పందంలో భాగంగా ‘ఫిల్ అండ్ ఫినిష్’ ప్రక్రియను వోకార్ట్ సంస్థ సెప్టెంబర్​లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఉత్తర వేల్స్ ​లోని వ్రెక్సం ప్రాంతంలో ఉన్న సంస్థ కర్మాగారంలో టీకాల ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. టీకాను పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావడానికి యూకే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని వోకార్ట్​ సంస్థ చైర్మన్ డాక్టర్ హబిల్ ఖొరకీవాలా పేర్కొన్నారు. కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు ఓ అంతర్జాతీయ సంస్థగా అవసరమైన సాయాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news