కరోనా వలన భారత్ కు పెద్ద సమస్య: బాంబు పేల్చిన ట్రంప్

-

తాజాగా అమెరికాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని తెలిపారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. గత వారంతో పోల్చితే బాధితుల సంఖ్య 6 శాతం మేర తగ్గినట్లు వెల్లడించారు. పాజిటివ్​ రేటు కూడా 8.7 శాతం నుంచి 8 శాతానికి చేరినట్లు పేర్కొన్నారు. మహమ్మారిపై పోరులో పురోగతి సాధించినట్లు చెప్పారు. ప్రపంచ దేశాలతో పోల్చితే అమెరికాలోనే పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు ట్రంప్. ప్రపంచంలోని ఉన్నత దేశాల్లో కరోనా కట్టడిలో అమెరికానే మెరుగైన స్థానంలో ఉంది.

trump
trump

18 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పటి వరకు 6 కోట్ల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించాం. మరే ఇతర దేశం ఈ దారిదాపుల్లో కూడా లేదని తెలిపారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న భారత్​ ఇప్పుడు అసలు సమస్యను ముందు ముందు ఎదురుకోవాల్సి ఉందని బాంబు పేల్చాడు. చైనాలో కూడా కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నాయని, వైరస్​ మళ్లీ విజృంభిస్తోందని ట్రంప్ తెలిపారు. 47లక్షలకు పైగా కేసులు, లక్షా 55 వేలకు పైగా మరణాలతో కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది అమెరికా దేశం. అయితే ఇప్పుడు భారత్​లో ప్రపంచంలోనే అత్యధికంగా రోజుకు 50వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. అటు చైనాలో మూడు నెలల తర్వాత వారం రోజుల్లోనే 100 కుపైగా కేసులు వెలుగు చూశాయి.

Read more RELATED
Recommended to you

Latest news