రష్యా- ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది ఇండియన్ గవర్నమెంట్. తాజాగా ఉక్రెయిన్ పరిణామాలపై ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించేందుకు ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చ జరిగింది. ప్రస్తుతం రొమానియా, హంగేరి, పోలాండ్ ద్వారా భారతీయును స్వదేశానికి తీసుకువస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. హంగేరీ, రోమేనియా, పోలాండ్, స్లోవేకియా దేశాలకు కేంద్ర మంత్రులను పంపిచేందుకు భారత్ సిద్దం అయింది. ఉక్రెయిన్ సరిహద్దుల దేశాలకు మంత్రుల టీం వెళ్లి ‘ ఆపరేషన్ గంగ’ను పర్యవేక్షించే అవకాశం ఉంది. భారతీయును తక్షణమే స్వదేశానికి తీసుకురావడం మీటింగ్ లో ప్రధాన ఎజెండాగా చర్చ జరిగింది. మరోవైపు పోలాండ్ సరిహద్దులకు భారతీయుల తాకిడి ఎక్కువ అయింది. దీంతో నిన్న పోలాంగ్ సరిహద్దుల్లో కొంతమంది పోలీసులు భారతీయ విద్యార్థులపై దాడి చేశారు. ఈ విషయాన్ని కూడా ప్రధాని మోదీ ద్రుష్టికి తీసుకెళ్లారు.