సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం మరియు నిర్వహణ వీటిపైనే ఎక్కువ మనసు పెంచుకుంటున్నారు కేసీఆర్. ముఖ్యంగా గడిచిన కాలంలో ధాన్యం దిగుబడులు చాలా బాగుండడంతో పాటు వలసలు కూడా తగ్గాయని ఓ నిర్థిష్ట అభిప్రాయం తెలంగాణలో నిలిచిపోయింది.దీనిని దేశ వ్యాప్తంగా తీసుకువెళ్తే తాను జాతీయ స్థాయిలో సులువుగా రాణించేందుకు అవకాశాలు అన్నవి పుష్కలంగా ఉంటాయన్నది కేసీఆర్ ప్లాన్. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో వివిధ ప్రాంతీయ పార్టీల కూటమికి సారథ్యం వహించే నేతగా ఉన్న కేసీఆర్ తనని తాను ప్రధాని అభ్యర్థిగా ఫోకస్ చేసుకోవడంలో భాగంగా తెరపైకి తెలంగాణ మోడల్ ను తీసుకుని వచ్చి, తద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అందుకు అనుగుణంగా ప్రశాంత్ కిశోర్ అండ్ కో తో పనిచేసి సానుకూల ఫలితాల సాధనకు దారిని సుగమం చేసుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నారు.
తెలంగాణ నేలలను సస్య శ్యామలం చేయడం,ముఖ్యంగా 15 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టును పచ్చందనాలతో నింపడం అన్నది మల్లన్న సాగరంతోనే సాధ్యమన్నది కేసీఆర్ విశ్వాసం.ఈ విశ్వాసాన్నీ ఈ నమ్మకాన్నీ జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే సాయం తీసుకోనున్నారు.తెలంగాణ మోడల్ పేరిట ఇప్పటిదాకా తాను చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మల్లన్న సాగరం కానీ దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయాలను లిఖిస్తున్నాయని,వీటినే తెలంగాణ మోడల్ గా ఫోకస్ చేయాలని భావిస్తున్న కేసీఆర్ కు పీకే తోడు ఇవాళ ఎంతో అవసరం.
ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేసిన ప్రశాంత్ కిశోర్ గత ఎన్నికల్లో జగన్ కు ఎంతగానో సాయం చేశారు. నవరత్నాలు రూపకల్పన చేసింది ఆయనే! నవరత్నాల పేరిట పలు పథకాలను ఆ రోజు జగన్ పాదయాత్ర సందర్భంగా ఎనౌన్స్ చేస్తుంటే విపరీతం అయిన స్పందన వచ్చింది.ఇదే సమయంలో జగన్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.అదేవిధంగా కేసీఆర్ కూడా కొత్త పథకాల రూపకల్పనపై పెద్దగా దృష్టి ఉంచకపోయినా తాను ఇప్పటిదాకా అమలు చేస్తున్న వాటిపై దేశ వ్యాప్తంగా ప్రచారం చేయగలిగితే చాలు అన్న వ్యూహంలో ఉన్నారు.ఇదే ప్రతిపాదనలను పీకే ముందు ఉంచారు కూడా! తాము అభివృద్ధి చేస్తున్నా దానిని ఎక్కడా అనుకున్న స్థాయిలో జనం మధ్యకు తీసుకువెళ్లలేకపోతున్నామన్
అందుకే పీకే సాయంతో మల్లన్న సాగరంపై కానీ ఇతర సాగునీటి ప్రాజెక్టులపై కానీ ముఖ్యంగా ఆయన మానస పుత్రిక దళిత బంధుపై కానీ మాట్లాడేందుకు,వాటికి మరింత ప్రాచూర్యం కల్పించేందుకు కేసీఆర్ యోచిస్తున్నారు.ఆ విధంగా మోడీకి దీటుగా మోడీ ఆరోజు చెప్పిన గుజరాత్ మోడల్ కు దీటుగా తెలంగాణ మోడల్ పై జాతీయ స్థాయిలో చర్చ నడిచేలా చేయాలన్నదే కేసీఆర్ వ్యూహం.