ఉక్రెయిన్ వదిలి వెళ్లేది లేదన్న జెలెన్ స్కీ… ఉక్రెయిన్ అధ్యక్షుడి ఎమోషనల్ వీడియో

-

ఉక్రెయిన్ వదిలి వెళ్లేది లేదని స్పష్టం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షడు వోలోడిమిర్ జెలెన్ స్కీ. కీవ్ నగర వీధుల్లో తిరుగుతూ… ఎమోషనల్ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈపోస్ట్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. నాకుటుంబంతో పాటు కీవ్ లో ఉంటానని అన్నారు. నకిలీలను నమ్మోద్దు అంటూ.. మన దేశాన్ని మనమే రక్షించుకుందాం అంటూ.. ఎవరూ ఆయుధాలను వీడొద్దని ప్రజలకు పిలుపుఇచ్చారు. అధ్యక్ష నివాస భవనం ముందు నుంచి ఈ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు.

 

మరోవైపు రష్యన్ ఆర్మీ.. అధ్యక్ష భవనాన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిని ఉక్రెయిన్ బలగాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. సాధారణ పౌరులు పెట్రో బాంబులతో రష్యన్ బలగాలపై దాడులు చేస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ని అమెరికాకు రావాలంటూ బైడెన్ కోరారు. ఇదిలా ఉంటే అమెరికా ఆహ్వానాన్ని తిరస్కరించారు జెలెన్ స్కీ. చివరి వరకు ఉక్రెయిన్ లోనే ఉంటానని ఆయన స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు ఎలాగైనా జెలెన్ స్కీ ని ఉక్రెయిన్ నుంచి తరలించాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దుల్లో అమెరికా తన రెండు యుద్ధవిమానాలను ఉంచినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news