రష్యా- ఉక్రెయిన్ మధ్య ఫిబ్రవరి లో ఆరంభమైన యుద్ధానికి అంతు ఉండట్లేదు. 73 రోజులుగా కొనసాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టమయ్యాయి. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. తాజాగా ఉక్రీయిన్ తూర్పు ప్రాంతంలోని ఓ పాఠశాల భవనం పై రష్యా వైమానిక బలగాలు బాంబులను సందించాయి. ఈ ఘటనలో 60 మంది మరణించి ఉంటారని లుహన్స్ రీజియన్ గవర్నర్ సెర్హి హైదీ తెలిపారు.
బిలహోరివ్కా లో ఈ దాడి సంభవించినట్లు చెప్పారు. యుద్ధం ప్రారంభమైన తరువాత ఈ స్కూల్ భవనాన్ని షెల్టర్ జోన్ గా మార్చింది అక్కడి ప్రభుత్వం. 95 మంది వరకు స్థానికులు ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఈ భవన సముదాయం పై రష్యా వైమానిక బలగాలు బాంబులను స్పందించినట్లు సైర్హి హైదీ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలను చేపట్టామని 30 మందికి పైగా కాపాడగలిగామని అన్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. రష్యా అమానవీయంగా ఇలాంటి దాడులకు పాల్పడుతోందని విమర్శించారు.