ఉక్రెయిన్ యుద్ధ రహస్యాలు లీక్.. అందులో ఏం ఉన్నాయంటే..?

-

ఉక్రెయిన్​పై రష్యా యుద్ధానికి సంబంధించి కొన్ని రహస్య పత్రాలు సోషల్ మీడియాలో వెలుగుచూశాయి. మ్యాప్‌లు, చార్ట్‌లు, కొన్ని ఫొటోలపై అత్యంత రహస్యం అని ఉండటం సంచలనం సృష్టించింది. అయితే, ఉక్రెయిన్‌ యుద్ధంపై అమెరికా రూపొందించిన పత్రాలే లీకైనట్లు తేలింది. అందులో ఏయే విషయాలు ఉన్నాయంటే..?

ఉక్రెయిన్‌లో కీలక యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని అమెరికా రక్షణశాఖ రూపొందించినట్లు సమాచారం. వీటిలో ఉక్రెయిన్‌, రష్యాకు చెందిన సైనికుల మరణాల సంఖ్య, ఆయా సైన్యాలకున్న ముప్పు, ఉక్రెయిన్‌ ప్రతిదాడులకు దిగాలని భావిస్తే వాటికున్న సామర్థ్యాలకు చెందిన డేటా ఉన్నట్లు సమాచారం. ఉక్రెయిన్‌కు అమెరికా అందించిన ఆయుధాలు, శిక్షణ సహాయం, సైనిక వ్యూహాల వంటి వివరాలు కూడా అందులో ఉన్నాయట.

ఇంటర్నెట్‌లో లీకైన ఈ డాక్యుమెంట్లు వాస్తవమైనవేనని అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ ధ్రువీకరించింది. ఈ విషయాలపై నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఈ డాక్యుమెంట్లను ఎవరు, ఎందుకు లీక్‌ చేశారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. కానీ, మార్చి తొలివారంలోనే అవి బయటకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌ కూడా వీటిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news