ఉక్రెయిన్ అధ్యక్షుడి సంచలన ప్రకటన… దేశం కోసం ముందుకు వచ్చిన వారికి ఆయుధాలు

-

ఉక్రెయిన్ పై రష్యా దాడి తీవ్రతరం చేసింది. ఇప్పటికే రాజధాని కీవ్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. దేశం కోసం ముందుకు వచ్చిన వారికి ఆయుధాలు ఇస్తామన్నారు. ఉక్రెయిన్ ను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. 

మరోవైపు ఉద్రిక్తల నేపథ్యంలో ఉక్రెయిన్, రష్యాతో తమ దౌత్య సంబంధాలను తెంచుకుంది. ఇప్పటివరకు రష్యా దాడుల్లో 40 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు, దాదాపు 10 మంది పౌరులు మరణించినట్లు అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. యుద్దాన్ని నివారించేందుకు ఉక్రెయిన్ మిత్ర దేశాలు రష్యాపై ఆంక్షలు విధించేందుకు వెనకాడోద్దని ఆయన కోరారు.  మరోవైపు ఉక్రెయిన్  ఆక్రమణకు ప్రయత్నించిన 50 మంది రష్యా సైనికులు తమ దాడుల్లో చనిపోయారని ఉక్రెయిన్ ప్రకటించింది. దీంతో పాటు 6 యుద్దవిమానాలను నేలకూల్చినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యాకు లొంగబోమని ఉక్రెయిన్ ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్ కు ఫ్రాన్స్, అమెరికా, జపాన్ వంటి దేశాలు మద్దతు ప్రకటించాయి. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా దాడితో పోలాండ్ , జర్మనీ అప్రమత్తం అయ్యాయి. పోలాండ్ పై దాడి చేస్తే పెద్ద ఎత్తున సైనిక సహకారం అందిస్తామని రష్యా ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news