రష్యా- ఉక్రెయిన్ మధ్య నేడు రెండో విడత చర్చలు

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. రోజురోజుకు యుద్ధ తీవ్రత మరింతగా పెరుగుతోంది. నిన్నటి నుంచి రాజధాని కీవ్ తో పాటు రెండో అతిపెద్ద పట్టణం ఖార్కీవ్ పై రష్యా సేనలు దాడులను ఎక్కువ చేశాయి. భవనాలు, జనావాసాలే టార్గెట్ గా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నాయి. 

ఇదిలా ఉంటే మరోసారి ఈ రెండు దేశాలు చర్చలకు సిద్ధం అయ్యాయి. తొలి విడతలో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. నేడు రెండో విడత చర్చలు బెలారస్ దేశంలో బెలారస్ – పోలాండ్ సరిహద్దుల్లో జరుగనున్నాయి. బెలారస్ బ్రెస్ట్ ప్రాంతంలో ఈ చర్చలు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే ఇరు దేశాలు కూడా తమతమ డిమాండ్లపై పట్టుబడుతున్నాయి. రెండో విడత చర్చలకు సిద్ధంగా ఉన్నా.. కావాలని ఆలస్యం చేస్తోందని ఉక్రెయిన్ పై రష్యా ఆరోపిస్తోంది. అమెరికా ఆదేశాల మేరకే ఇలా చేస్తుందని రష్యా అంటోంది. ఉక్రెయిన్ తమ డిమాండ్లపై తగ్గేదే లేదు అంటోంది. ముందు రష్యా తమ బలగాలను వెనక్కి తీసుకోవాలని, యుద్ధం ఆపాలని డిమాండ్ చేస్తుంటే.. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరవద్దని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని రష్యా డిమాండ్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news