ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను చుట్టుముట్టారు. ఇక స్వాధీనం చేసుకునేందుకు సిద్ధం ఉంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రష్యా దురాక్రమణపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏకాకులం అయిపోయామని.. మాది ఒంటరి పోరే అని ఆవేదన వ్యక్తం చేశారు. నాటోలోని 27 దేశాలకు ఫోన్ చేశామని.. సహాయాన్ని ఆర్థించామని, ఎలాంటి స్పందన లేనది అన్నారు. సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని ఆయన అన్నారు. పుతిన్ తో చర్చించేందుకు ప్రయత్నించినా.. స్పందన రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా నుంచి ఉక్రెయిన్ ని కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేశామని ఆయన అన్నారు. మొదటి రోజు సంఘర్షణలో 137 మంది ఉక్రేనియన్లు మరణించారని జెలెన్స్కీ చెప్పారు. రష్యా తనను “టార్గెట్ నంబర్ వన్”గా గుర్తించినప్పటికీ, నేను నా కుటుంబం ఉక్రెయిన్ లోనే ఉన్నామని ఆయన వెల్లడించారు. రష్యా బలగాలు కీవ్ లోకి ప్రవేశించారని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలిన ప్రజలకు సూచించారు.
ఏకాకులం అయిపోయాం… మాది ఒంటరి పోరే: ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆవేదన
-