తమతో కలిసి పోరాడాలి… విదేశీయులకు ఉక్రెయిన్ ఆహ్వానం

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. నాలుగు రోజులుగా ఇరు దేశాల సైనికులు పోరాడుతున్నారు. రష్యన్ ఆర్మీ ఉక్రెయిన్ ను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. వరసగా పలు ప్రధాన నగరాలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దేశంలో రెండో పెద్ద నగరం ఖర్కీవ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నామని రష్యన్ ఆర్మీ ప్రకటించింది. మరోవైపు రాజధాని కీవ్ ను ఆక్రమించుకునేందుకు రష్యన్ బలగాలు ఓ వైపు… కీవ్ ను రక్షించేందుకు ఉక్రెయిన్ బలగాలు మరోవైపు ఇలా రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది.

దేశాన్ని రక్షించేందుకు ముందుకు వచ్చిన యువకులకు ఆయుధాలు ఇస్తామని ప్రకటించిన.. ఉక్రెయిన్ ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేసింది. ఉక్రెయిన్ ను కాపాడటానికి స్వచ్ఛందంగా విదేశీయలు సైన్యంలో చేరాలని ఆహ్వనించింది. ఇలా సైన్యంలో చేరాలని ముందుకు వచ్చే విదేశీయులు ముందుగా వారి దేశాల్లోని దౌత్యకార్యాలయాలను సంప్రదించాలని కోరారు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రో కుబేలా కోరారు. అలాంటి వారితో అంతర్జాతీయ దళాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అప్పట్లో అందరం కలిసి హిట్లర్ ను ఓడించామని, ఇప్పడు పుతిన్ ను ఓడిద్దాం అని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news