ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరిది ఆత్మహత్యే – పోలీసులు

-

నందమూరి తారక రామారావు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దివంగత నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసంలో కన్నుమూశారు. కంఠమనేని ఉమామహేశ్వరి ఎన్టీఆర్ కి చిన్న కూతురు. ఆమె హఠాన్మరణంతో ఎన్టీఆర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఉమామహేశ్వరి సంఘటనలో పోలీసులు కీలక సమాచారాన్ని కాసేపటి క్రితమే ప్రకటించారు.

ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమా మహేశ్వరి (52) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల వెల్లడించారు. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఉస్మానియా ఆస్పత్రికి ఉమామహేశ్వరి మృతదేహాన్ని తరలించారు. ఇక ఉమామహేశ్వరి భౌతిక దేహానికి పోస్టుమార్టం చేసిన అనంతరం, కుటుంబసభ్యులకు ఆమె భౌతికకాయం అప్పగించనున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news