కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా.. ఈ మహమ్మారి బారిన రాజమండ్రి మాజీ ఎంపీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పడ్డారు.
గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్… కరోనా పరీక్షలు చేయించుకోగా.. రిపోర్టులో పాజిటివ్ అని వచ్చింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు ఆయన భార్యకు కూడా పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు నెగిటివ్ వచ్చింది.