చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతికి పాల్పడ్డారని సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ హై కోర్ట్ లో కొట్టివేయగా ,సుప్రీమ్ కోర్ట్ లో కేసు విచారణలు జరుగుతున్నాయి. తాజాగా ఇదే అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబుకు తెలియకుండా స్కిల్ డెవలప్మెంట్ లో ఇంత పెద్ద స్కాం జరిగిందంటే ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని సెటైరికల్ గా వ్యాఖ్యానించారు. ఈ స్కాం లో ఖచ్చితంగా చంద్రబాబు హస్తం ఉంది, జాతీయ స్థాయిలో అందరూ ఈ స్కాం గురించి మాట్లాడుకుంటున్నారు. ముందు ముందు చాలా వాస్తవాలు ఈ కేసు ద్వారా బయటకు రావాలి వస్తాయి అంటూ ఉండవల్లి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక ముందు నుండి నేను చెబుతున్న విధంగానే ఈ కేసును వెంటనే సిబిఐ కి అప్పగించడం మంచిదంటూ తన అభిప్రాయాన్ని ఉండవల్లి తెలియచేశారు.
ఉండవల్లి ఒక విషయంలో ఏదైనా ఉంది అని పట్టుబట్టాడంటే తప్పు జరిగివుంటేనే మాట్లాడుతారు అని అందరికీ తెలిసిందే. కానీ ఇంకా పూర్తి వాస్తవాలు బయటకు వస్తేనే కొందరి నోళ్లు మూతబడుతాయి అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.