తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కేసీఆర్ మళ్ళీ ఎలాగయినా సీఎం కావాలని చాలా కసిగా ఉన్నారు. అందులో భాగంగా ఎన్నికలకు ముందు అన్ని పార్టీలకన్నా ముందు మ్యానిఫెస్టోను ప్రకటించడానికి ముహుర్తాన్ని కూడా ఖరారు చేశారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం రేపు మధ్యాహ్నం సమయంలో మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. కాగా ఈ మానిఫెస్టోలో ఉండే అంశాలు ఇవే అంటూ ఒక లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అందులో ప్రధానంగా నాలుగు లేదా అయిదు వర్గాలకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడానికి హామీ ఇస్తున్నారట. కేవలం మధ్యతరగతి వారి కోసమే ఒక మంచి పధకాన్ని తీసుకురానున్నారట. ఇప్పటి వరకు ఇస్తున్న పెన్షన్ లను పెంపు చేస్తారట. అదే విధంగా రైతు బంధు కింద ఇచ్చే నగదును సైతం పెంచే యోచనలో కేసీఆర్ ఉన్నాడట. ఇంకా గృహిణులు ఫుల్ ఖుషీ అయ్యే విధముగా స్కీం లు తీసుకువస్తారట. దళిత బీసీ మైనారిటీ బంధు పథకాలు ఎక్కువ తీసుకు వస్తారట.
ఇంకా దేశానికి పట్టుగొమ్మలు ఐనా యువతకు ఉపాధినిచ్చే హామీలను ఇవ్వనున్నారట. ఈ మేనిఫెస్టోలోని అంశాలు ప్రజలను ఆకట్టుకుని కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం ను చేస్తాయా చూడాలి.