అండర్‌-19 ప్రపంచకప్‌..ఇవాళ సౌతాఫ్రికా, భారత్ మధ్య మ్యాచ్‌

క్రికెట్‌ లవర్స్‌ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అండర్‌-19 ప్రపంచ కప్‌ నిన్న ప్రారంభం అయింది. అండర్‌ – 19 లో ప్రపంచ కప్‌ పోటీలు మొదలై ఇప్పటికీ మూడు దశబ్దాలు దాటింది. పదమూడు టోర్నీలు జరిగాయి. ఇప్పుడు 14 వ టోర్నీకి వెస్టిండీస్‌ ఆతిథ్యం ఇస్తోంది. నేటి వరకు టీమిండియా అత్య ధికంగా ఏడుసార్లు ఫైనల్‌ కు చేరుకోగా.. నాలుగు కప్‌ లను సాధించింది.

ఆ తర్వాత ఆసీసీ మూడు సార్లు, పాక్‌ రెండు సార్లు, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌ ఒక్కోసారి టైటిల్‌ గెలుచుకున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా… నేడు అండర్‌- 19 ప్రపంచ కప్‌ లో భాగంగా మొదటి మ్యాచ్‌ ఆడనుంది టీమిండియా. నేడు సౌతాఫ్రికా తో భారత్ తలపడనుంది.. జార్జ్‌టౌన్‌ వేదిక గా సాయంత్రం 6.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇక ఫుల్‌ ఫామ్‌ లో ఉన్న టీమిండియా… ఈ మ్యాచ్‌ లో హాట్‌ ఫేవరేట్‌ గా కనిపిస్తోంది.