ఏపీలో దారుణం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లాలో గుర్తు తెలియని దుండగులు తుపాకీతో హల్ చల్ చేశారు. పీలేరు మండలం ఓంటిల్లులో టీడీపీ నాయకుడు గిరి నాయుడు ఇంట్లోకి 10 మంది దుండగులు చొరబడి గన్‌తో ఆయనను బెదిరించి దాడి చేశారు.

వారిని ప్రతిఘటించిన గిరి తుపాకీ లాక్కోగా నిందితులు బైకుపై పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.