కాంగ్రెస్ ప్రభుత్వం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

-

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. గురువారం యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం రాఘవపురం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఐకేపీ సెంటర్ వద్దకు వెళ్లి కొనుగోళ్లపై ఆరా తీశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. రుణమాఫీ లేదు, బోనస్ లేదు అంతా బోగస్ మాటలే అని కొట్టిపారేశారు.

సీఎం రేవంత్ రెడ్డి తరచూ దేవుళ్లపై ఒట్టు పెడుతున్నాడు.  దేవుళ్లపై ఒట్లు పెడితే రైతుల సమస్యలు తీరవని చురకలు అంటించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ రైతులు పండించిన ప్రతి గింజను కొనడానికి సిద్దంగా ఉందని అన్నారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని, మొలకెత్తిన వారిని బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సన్నరకం పేరుమీద.. దొడ్డు వడ్ల రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news