కేసీఆర్ అంటే కల్వకుంట్ల కరప్షన్ రావు…కమీషన్ రావు.. అని కేంద్ర మంత్రి మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మోడీ సర్కారు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని.. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. కనీస మద్దతు ధరలు పెంచిందని.. తెలంగాణ రైతులకు కేంద్రం ఏమి చేయడం లేదని కేసీఆర్ అంటున్నారని మండిపడ్డారు.
పీయూష్ గోయల్ దాన్యం కొంటామని చెప్పారని.. రైతుల పంట కొనడానికి కేంద్రం డబ్బులు ఇస్తుందని వెల్లడించారు. తెలంగాణ రైతుల కు లక్ష కోట్లు ఇచ్చింది(దాన్యం కొనుగోలు చేసింది).. మద్దతు ధర కన్నా తక్కువ కు రైస్ మిల్లర్లు కొంటున్నారన్నారు.
మిల్లర్లు,trs నేతలు కుమ్మక్కు అయ్యారని.. హుజురాబాద్ లో కమిషన్ రావు వందల కోట్లు ఖర్చు చేసిన ఈటల రాజేందర్ ని ,బీజేపీ ని ప్రజలు గెలిపించారని చురకలు అంటించారు. కేసీఆర్ ని రాజకీయాలు ప్రజలకు తెలుసు అని.. కేసీఆర్ మోడీ కి వ్యతిరేకంగా దేశమంతా తిరిగాడు… ఏమైంది..? అని ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్ మీద ఆధారాలు కావాలని కమిషన్ రావు అడుగుతున్నాడు… పాకిస్థాన్ వాళ్ళ పై ఎక్కువ నమ్మకం అన్నారు.