నగరంలో భారీగా మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్న అధికారులు

-

నగరంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు చేపట్టగా,ఈ సోదాల్లో నగరంలో ఇల్లీగల్‌గా బెల్ట్ షాపులు నడుస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు.హైదరాబాద్‌ కమిషనరేట్ పరిధిలోని పలు బెల్టుషాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. కుల్సుంపురా, ముషీరాబాద్,ఛత్రినాక, కాచిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో బెల్ట్ షాపులపై దాడులు చేశారు. 96.5 లీటర్ల విలువ చేసే 242 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఐదుగురు నిందితులను ఎక్సైజ్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అయితే వారిని పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. నిందితులకు అసలు మద్యం ఎక్కడ నుంచి వస్తుందనే విషయంపై వివరాలు రాబడుతున్నారు. నగరంలో ఇంకా ఏయే ప్రాంతాల్లో వారు గుట్టుచప్పుడు కాకుండా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారనే అంశంపై కూడా పోలీసులు దృష్టి సారించారు. నిందితుల దగ్గరి నుంచి మరింత సమాచారం సేకరించిన తర్వాత వారికి మద్యం రవాణా చేసే వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news