‘హర్ ఘర్ తిరంగా’.. స్కూటర్‌పై ఆఫీసుకెళ్లిన కేంద్ర మంత్రి

-

ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 75వ స్వాతంత్ర్య వేడుకలను ఇప్పటినుంచే జరుపుతున్నారు. కేంద్ర మంత్రులు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జాతీయ జెండాను తీసుకుని ప్రయాణిస్తున్నారు. గురువారం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్కూటర్ నడుపుతూ ఆఫీసుకు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

స్మృతి ఇరానీ
స్మృతి ఇరానీ

స్మృతి ఇరానీ వెనకాల కేంద్ర సహాయ మంత్రి భారతీ పవార్ కూడా కూర్చున్నారు. ఆమె చేతిలో జాతీయ జెండా కూడా ఉంది. అలాగే స్కూటర్ వెనకాల కూడా త్రివర్ణ పతాకాన్ని కట్టారు. భారతీ పవార్‌ను ఆమె ఆఫీస్ వద్ద డ్రాప్ చేసినట్లు మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీల్లో దేశ ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాల్లో డీపీలుగా జాతీయ జెండా ఫోటోలను పెట్టుకోవాలని తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు తమ సోషల్ మీడియా అకౌంట్లకు డీపీ ఛేంజ్ చేశారు.

https://www.instagram.com/reel/CgyXQ_Frd6M/?utm_source=ig_embed&ig_rid=e1a12541-65fb-4a15-97cc-40f05bdd1d24

Read more RELATED
Recommended to you

Latest news