అన్ లాక్ 5.0 : థియేటర్స్ సహా అన్నిటికీ గ్రీన్ సిగ్నల్..

-

థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూసిన వాళ్లకి శుభవార్త వచ్చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుండి అన్ లాక్ 5.0 మొదలు కానుంది. దీనిలో భాగంగా చాలా వ్యాపార కార్యకలాపాలకి గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సడలింపులని ఇచ్చింది. ఈ నేపథ్యంలో థియేటర్లు, స్విమ్మింగ్ ఫూల్స్, ఎంటర్ టైన్ మెంట్ పార్కులకి అనుమతులు ఇచ్చింది. కోవిడ్ నియమాల్ని పాటిస్తూ అన్ని జాగ్రత్తల నడుమ వీటిని ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది. అక్టోబర్ 15వ తేదీ నుండి థియేటర్లలో బొమ్మ పడనుందన్న మాట. ఐతే సీటింగ్ కెపాసిటీ సగమే ఉండాలని షరతు పెట్టింది. అంటే వెయ్యి సీట్లు ఉంటే 500మంది మాత్రమే సినిమా చూడొచ్చన్నమాట.

ఇక స్విమ్మింగ్ ఫూల్స్ విషయానికి వస్తే, క్రీడాకారులు శిక్షణ తీసుకునే స్విమ్మింగ్ ఫూల్స్ ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది. ఇంకా పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకోనున్నాయి. అక్టోబర్ 15వ తేదీ నుండి గ్రేడెడ్ పద్దతిలో తెరుచుకోవచ్చునని తెలిపింది. ఐతే పాఠశాలలు తెరుచుకున్నా కూడా ఆన్ లైన్ క్లాసులకి అంతరాయం కలగకుండా చూసుకోవాలని, విద్యార్థులని పాఠశాలకి పంపిస్తున్నామని తల్లిదండ్రులు లెటర్ రాయాల్సి ఉంటుందట. పాఠశాలకి రాని విద్యార్థులకి ఆన్ లైన్ లో క్లాసులని బోధించాల్సిందిగా తెలిపింది.

కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ లాక్ 5.0 ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news