Unstoppable With NBK : ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్

-

మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ తో ఇప్పటివరకు వెండితెరపై అదరగొట్టిన నందమూరి బాలకృష్ణ…. సరి కొత్త అవతారం ఎత్తుతున్నారు. అటు సినిమాలు తీస్తూనే ఇటు బుల్లితెరపై సందడి చేయడానికి రెడీ అయిపోయారు బాలయ్య. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా… నందమూరి బాలయ్య తో అన్ స్టప బుల్ టాక్ షో నూ స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈ షో నుంచి తాజాగా ఓ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.

తాజాగా ఈ షో కు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ ప్రోమోను విడుదల చేసింది ఈ సంస్థ అహ. అయితే.. బాలయ్య షోలో మొదటి గెస్ట్‌ గా డైలాగ్‌ కింగ్‌ మంచు మోహన్‌ బాబు వచ్చారు. మోహన్‌ బాబుతో పాటు మంచు విష్ణు మరియు లక్ష్మి ప్రసన్న కూడా ఈ షోలో సందడి చేశారు.

ఇక ఈ ప్రోమోలో ఆసక్తికర ప్రశ్నలతో మోహన్‌ బాబు తెగ ఇబ్బంది పెట్టారు బాలయ్య. చిరంజీవితో రిలేషన్‌ షిప్‌ పై బాలయ్య ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే… టీడీపీ పార్టీ పై కూడా బాలయ్య మరియు మోహన్‌ బాబు మధ్య ప్రస్థావన వచ్చింది. అటు మంచు విష్ణు మరియు లక్ష్మి ప్రసన్న కామెడీతో ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news