ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ అధికార బీజేపీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్ర మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారం యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గానికి, బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దళితులు, వెనుకబడినవారు, రైతులు, నిరుద్యోగ యువత మరియు చిన్న, మధ్యతరహా వ్యాపారుల పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరి కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని యోగి మంత్రివర్గం నుండి నేను రాజీనామా చేస్తున్నాను అని స్వామి ప్రసాద్ మౌర్య ట్విట్ చేశారు. రాజీనామా లేకను కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు.
బీజేపీకి రాజీనామా అనంతరం సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఆపార్టీలో చేరారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య అని.. ఆయన సమాజ్ వాదీ పార్టీలో చేరడం అభినందనీయం అఖిలేష్ యాదవ్ అన్నారు. 2022లో సామాజిక న్యాయ ఉద్యమం వస్తుందని అఖిలేష్ ట్విట్ చేశారు.